దళిత బంద్ 10లక్షలు ఇవ్వాలి ఎం ఆర్ ఓ గారికి వినతిపత్రం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చిన మండల బీజేపీ దళిత మోర్చా నాయకులు...
ఇల్లంతకుంట మండలంలోనీ ప్రతి దళిత కుటుంబానికి దళితబందు 10 లక్షలు రూపాయలు ఇవ్వాలని మానకొండూర్ ఎం ల్ ఎ.రసమయి బాలకిషన్ గారిని గౌరవ ఇల్లంతకుంట మండలం తహసీల్దార్ గారి ద్వారా డిమాండ్ చేస్తూ మండల దళిత మోర్చా నాయకులు వినతిపత్రం ఇస్తూ మామిడి హరీష్ ప్రధాన కార్యదర్శి మాట్లాడతూ నవంబర్ 4 తేది నుండి తెలంగాణా రాష్ట్రము అంతటా దళితబందు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు 20 రోజులు గడిచిన ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో, వెంటనే మానకొండూర్. ఎం ల్ ఎ.రసమయి బాలకిషన్ గారు ఇల్లంతకుంట మండలం లోని ప్రతి దళిత కుటుంబనికి దళిత బందు ద్వారా 10 లక్షలు రూపాయలు ఇప్పించాలాని,ఎం ల్ ఎ.గారు వారం రోజుల్లో నియోజకవర్గం లో దళితబందు అమలు చేయకపోతే, ఎం ల్ ఎ.పదవికి రాజీనామా చేయాలన్నారు,ఎం ల్ ఎ.గారు ఎలాంటి చర్యలు తీసుకుకపోతె,డిసెంబర్ 1 నుండి ప్రజాందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బొల్లరం ప్రసన్న,నాగసముద్రాల సంతోష్,మామిడి శేఖర్, వజ్జపెల్లి శ్రీకాంత్, దుబ్బ చింటూ,గొర్రె అఖిల్, పున్ని ప్రశాంత్,పాలుగోన్నారు