వరి ధాన్యాన్ని త్వరగా తరలించాలి
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో ఈరోజు
మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్. గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలంలో వడ్ల కొనుగోలు సెంటర్ లలో ధాన్యాన్ని తరలించే పక్రియను వేగవంతం చేయాలని.లారీలు ప్రతి గ్రామానికి రోజు పంపాలని ఈ రోజు జిల్లా అధికారులు జితేందర్ రెడ్డి , హరికృష్ణ లతో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పాక్స్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన
రాజన్న సిరిసిల్లా జడ్పీ వైస్ చైర్మేన్
సిద్దం వేణు గారు .
ఈ సందర్భంగా
సిద్ధం వేణు.గారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని అన్ని గ్రామాల్లో కొనుగోలు సెంటర్ లో నిల్వ ఉంచడం జరిగింది.కొనుగోలు ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది కావున వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ట్రాన్స్పోర్టేషన్ మరియు రైస్ మిల్ లలో త్వరిత గతిన అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు లారీలు పెద్ద సెంటర్ లకు మూడు చొప్పున చిన్న సెంటర్లకు రెండు చొప్పున రోజు సెంటర్లకు పంపాలని అన్నారు.. రైతు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియలో భాగంగా రైస్ మిల్లు వారు కూడా రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు...
ఈ కార్యక్రమం లో పాక్స్ చైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి,తెరాస పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సాంహరెడ్డి,పాక్స్ వైస్ చైర్మేన్ గొడుగు తిరుపతి,అనంతగిరి ఎంపీటీసీ గొట్టిపర్తి పర్శరాములు,ఉప సర్పంచ్ బుర్ర బాలకిషన్,నాయకులు కేవీన్ రెడ్డి,మీసరగండ్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.