ఘనంగా 72 వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం

0

ఘనంగా   72 వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం
న్యూస్ పవర్.బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో 72 వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల బిజెపి దళిత మోర్చా  ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం మరియు పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విశ్వమానవుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 125 వ జయంతి సందర్భంగా 2015 సంవత్సరంలో నవంబర్ 26 జాతీయ రాజ్యాంగ దినోత్సవం గా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. భారత రాజ్యాంగం  బ్రిటిష్ పరిపాలన అనంతరం దేశానికి చక చక దిద్దుకునేందుకు ఎందరో మహానుభావులు చేసిన కృషి అని దాని ఫలితమే ప్రపంచంలోనే  అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం రూపొందిందని రాజ్యాంగ నిర్మాణం ద్వారానే అట్టడుగు వర్గాల మరియు దళిత పీడిత జనాలు యొక్క అభివృద్ధి సాధ్యపడిందని ప్రజాస్వామ్య రాజ్యాంగం  బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక సమరసత స్వేచ్ఛను కలిగే విధంగా పాలన కొనసాగిస్తుందని ప్రజాస్వామ్య రక్షణ, అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాల సాధనకై  మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జేపల్లి శ్రీకాంత్, సీనియర్ నాయకులు సాయి గౌడ్, మ్యాకాల మల్లేశం, నాయకులు చింటూ, వర్ధన్, ప్రశాంత్, ప్రకాష్, పవన్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top