రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి: మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్
రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ల జాప్యం, వాహనదారులకు తప్పని తిప్పలు
చోద్యం చూస్తున్న అధికార యంత్రం
ఇరుకు రోడ్లతో ప్రమాదాలు, పదుల సంఖ్యలో వాహనదారులకు తీవ్ర గాయాలు
ఇల్లంతకుంట మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండటం వలన ప్రధాన రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు ఇసుక ట్రాక్టర్లు, భారీ వాహనాలు అతి పాటు వేగంతో వెళ్లడం తో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదానికి గురయ్యారని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ తెలిపారు. నిత్యం మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద ఒకటి, రెండు ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు గాయపడి ఆసుపత్రి పాలవుతున్నారు. కాగా క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం, కాంట్రాక్ట్ కంపెనీల నిర్లక్ష్యంతో రోడ్లు అధ్వానంగా మారిపోయి ప్రమాదాలకు నిలయంగా ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పును కలిగి ఉండాలి కానీ రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శమన్నారు. రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తి జరగడం ద్వారా రోడ్డు మొత్తం చిన్నదిగా ఇరుకుగా మారడం, వాహనాల రాకపోకలు పెరగడం వలన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు నామ మంత్రంగా తొలిగింపు గుర్తులు పెట్టడంతోనే సరిపోయిందని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. కాగా పూర్తి స్థాయిలో విస్తరణ జరిగిపోవడం లో అంతర్యం ఏమిటనే దానిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, మండలంలోని ప్రజలు అయితే అసలు విస్తరణ పూర్తిగా జరుగుతుందా ? లేదా ? అనే స్థాయిలో ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. మండల కేంద్రంలో వాహనాల రద్దీ సమస్యను అధిగమించాలంటే ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని రోడ్డు విస్తరణ పనులను సత్వరమే చేపట్టి గ్రామం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.