రసమయి బాలకిషన్ గారి గురించి మాట్లాడే అర్హత బిజెపి నాయకులకి లేదు
టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్.
గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారి గురించి మాట్లాడే అర్హత బిజెపి నాయకులకి లేదని టీఅర్ఎస్ యూత్ అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ అన్నారు ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలు గా ఎనలేని అభివృద్ది పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి రసమయి గారు అని ఎమ్మెల్యే గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు బిజెపి నాయకులకి దమ్ముంటే ఎంపీ బండి సంజయ్ మానకొండూరు నియోకవర్గానికి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు అస్సలు ఈ ప్రాంతానికి ఎంపీ ఉన్నాడా లేదా అని ప్రజలు అయోమయం లో ఉన్నారని, 70 ఎండ్లు గా చేయలేని అభివృద్ది గత 7 సవత్సరాలలో చేశాడని రైతుల పక్షాన యసంగి వడ్లు కొనాలని మాట్లాడితే దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం నీచమైన చర్య అని రైతులు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఇంకోసారి గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారి పైన చిల్లర చేష్టలు చేస్తే ఉరుకునే ప్రసక్తే లేదని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు... ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాగటి రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పసుల బాబు, నాయకులు ప్రశాంత్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.