ప్రధాని నరేంద్ర మోడీ పై మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే బహిరంగంగా క్షేమాపణ చెప్పాలని ఇల్లంతకుంట మండల బీజేపీ శాఖ తరుపున డిమాండ్ చేస్తున్నామని దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు పై మండిపడ్డారు. ఉప్పడు రైస్ తప్ప.. మోడీ వరి ధాన్యం కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పుకోలేదన్నారు. మిల్లర్లతో కుమ్మకై వారి లాభం కోసం కేసిఆర్ నీచపు రాజకీయాలకు పాల్పడుతున్న ట్లు చెప్పుకొచ్చారు. కాగా ఆలోచిత విధంగా అధికార గర్వం తో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇప్పటికైనా రసమయి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని, బహిరంగంగా క్షేమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని యెడల మండలంలో జరిగే ఎమ్మెల్యే పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ, శేఖర్, ప్రశాంత్, వర్ధన్, చింటూ పాల్గొన్నారు