అదైర్య పడకండి అండగా ఉంటాం
రసమయి బాలకిషన్
_మానకొండూర్ శాసన సభ్యులు_
౼ దుబాయి వలస గల్ఫ్ కార్మిక కుటుంబాలకు భరోసా
౼ వారి బాదను చూసి చెలించి వెంటనే స్పందించి ఇండియన్ ఎంబాసి మరియు దుబాయి ఎంబాసి అధికారులతో మాట్లాడిన రసమయి
రిపోర్టర్ బొల్లం సాయి రెడ్డి ఇల్లంతకుంట
వివరాలలోకి వెళుతే రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన
1) శ్రీరాముల రవిందర్ {వడ్రంగి} బార్య:రమ పిల్లలు:దీపిక(13) సుభిక్ష(11)
2)కంచె రవిందర్ {SC మాదిగ} బార్య: దేవంద్ర పిల్లలు :సౌమ్య 19 సౌష్ణవి 1 నయన్ 13
బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకొని దుబాయి పోయి ఎజెంట్ చేతిలో మోసపోయి జైలు జీవితం గడుపుతున్నారు..ఇట్టి విషయం గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారి దృష్టికి తీసుక వెల్తె వెంటనే అయన స్పందించి దుబాయి అడ్వకేట్ అనురాధ,ఎంబాసి అధికారులు చిట్టి బాబుతో మాట్లాడి వారిని ఇండియాకు తొందర తెప్పియండి నా వంతు సహాయం చేస్తానని ఇట్టి విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకపోతానని గౌరవ మంత్రి KTR గారితో మాట్లాడుతానని అన్నారు.అనంతరం దుబాయ్ ఎంబాసికి కూడా ఫోన్ లో మాట్లాడినారు.దుబాయి వలస కార్మీకుల కుటుంబాలకు వారి అదైర్య పడకండి అండగా ఉంటాను అని అన్నారు.
అనంతరం రసమయి గారు మాట్లాడుతూ తెలంగాణ నుండి అన్నలు తమ్ముళ్ళు ఇంకా ఎందరో వలసజీవులు అమ్మ నొదిలి, ఆలీ నొదిలి, పిల్ల నొదిలి, జెల్ల నొదిలి, ఇల్లు నొదిలి, గల్ఫ్ బాట పట్టడానికి లక్షల రూపాయలు ఏజెంట్ల చేతిలో పెట్టి మోసపోయిన అభాగ్యులెందరో ఉన్నారని అన్నారు. రాత్రనక పగలనకా కొడుకుల గురించి నాన్నల ఆరాటం ఓ పక్క చెల్లె పెళ్ళి ఎలా చేయాలో అని కన్నతల్లుల పడే ఆరాటం మరోపక్క
అమ్మనాన్నల ఆరాటం చూసి వాల్లకష్టాన్ని పాలుపంచుకొవాలి అనుకున్న ఎందరో వలస జీవులు
చెల్లెలు పెళ్ళి చేయాలంటే నాలుగు డబ్బులు కావాలి
చదివిన చదువుకి అవకాశం తక్కువే అయినసరే ఉన్న ఊరు కన్న తల్లి తండ్రులను , బార్య పిల్లలని,తోబుట్టులను వదిలి గల్ఫ్ దేశానికి
తాళి బొట్టు తాకట్టు పెట్టు అరభ్ షేక్ ల దగ్గర చాకిరి చేసుకుంటూ,ఉపవాసాలు ఉంటు,చాలి చాలని జీతాలతో పబ్బం గడుపుతూ ,ఇరుకు గదులలో 15 నుండి 20 మంది ఇబ్బంది పడుతూ..కొందరు అనారోగ్యంతో మరికొందరు అప్పుల బాదతో చనిపోగ,కనీసం శవాలను చూసుకొనే బాగ్యం లేని ఎందరో కన్నతల్లులు,కట్టుకున్న బార్యలు ఉన్నారు. వారిని చూస్తె చాలా బాదనిపిస్తుంది అని అన్నారు.