వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన. ఎం పీ పీ
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఇల్లంతకుంట మండలం లోని జంగారెడ్డిపల్లే, తిప్పాపూర్ ,అంతగిరి, సిరికొండ గ్రామాలలో ఈ రోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని *జిల్లా వైస్ చైర్మన్ సిద్ధం వేణు* గారి మరియు *ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి* గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వంద శాతం కొనుగోలు చేస్తున్నరాని, ఒకప్పుడు సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు పంటలు పండించేందుకు ఇబ్బందులు పడ్డారని, కానీ ప్రస్తుతం కాళేశ్వర ప్రాజెక్టు తో రాష్ట్రంలో కోటి ఏకరాలకు నీళ్లు అందించి సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి కృషి చేసారని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యం విక్రయించాలని ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 1960, బి గ్రేడ్ రకానికి 1940 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. దళారులకు ధాన్యం విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమం లో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి,ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,సి ఈ.రవీంధర్ రెడ్డి, ఎంపీటీసీ తీగల పుష్పలత , పర్శశరాములు గౌడ్ ..సర్పంచ్ లు శ్రీలత నరేందర్ రెడ్డి ,ధమని లక్ష్మి - లక్ష్మణ్ ,నీలం లక్ష్మీ-అంజయ్య ,వెంకట్ రెడ్డి ,చంద్రారెడ్డి .ప్యాక్స్ డైరెక్టర్ లు పల్లె సృజన్ రెడ్డి,లక్ష్మి,ఉప సర్పంచ్ లు ,తెరాస.గ్రామ శాఖ అధ్యక్షులు,వార్డు సభ్యులు ,రైతులు ,తదితరులు పాల్గొన్నారు