ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందించాలి
సామాజిక సారథి ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలంలో ఆత్మహత్యలు చెసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే పరిహారం గౌll తహసీల్దార్ గారికి వినతి పత్రన్ని అందించిస్తున్న మండల బీజేపీ నాయకులు బెంద్రం తిరుపతిరెడ్డి అధ్యక్షులు మాట్లాడతూ దేశంలోనే తెలంగాణా రాష్ట్రము రైతుల ఆత్మ హత్యలలో 4 వ స్థానంలో ఉన్నా తెలంగాణా రాష్ట్రము లో అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు,భీమా సర్టిఫికెట్ లేని రైతులు,రైతు బీమా రాని రైతులు,భూమి లేని నిరుపేద రైతులు, కౌలు రైతులు 6580 చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలు అందించాలి కానీ ఈ తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారుగాని,మంత్రులు, MLA లు గాని పరిహారం అందిచలేదు,ఆ రైతు కుటుంబాలను కనీసం పరమర్చించిన దాకలాలు లేవు,తెలంగాణా రాష్ట్రములో రైతులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నా ఈ తెరాస ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రుణమాఫీ, ఉచిత ఎరువులు,రైతు సంక్షేమ సబ్సిడీ స్కింలకు మంగళం పడిన తెరాస ప్రభుత్వ తీరు పట్ల ఇల్లంతకుంట మండలంలోని 147 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే వారికి ఇప్పటి వరకు పరిహారం అందించని ముఖ్యమంత్రి వేరే రాష్టాలలో ఎక్కడో చనిపోయిన రైతులకు 3 లక్షలు ఇస్తానంటున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తక్షణమే మా ఇల్లంతకుంట మండలంలో బలన్మవరణం చెందిన రైతులకు కనీసం ఆ 3 లక్షలు ఐనా పరిహారం అందించాలని గౌరవ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మీ ద్వారా ఈ తెలంగాణా ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు,
ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ అధికారప్రాతినిధి కొత్త శ్రీనివాస్రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రొండ్ల మధుసూదన్రెడ్డి,జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న,జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులు నాగసముద్రల సంతోష్, బత్తిని స్వామి,దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, సొల్లు ప్రశాంత్, ఓబీసీ మండల అధ్యక్షులు అనగోని అవినాష్ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్,కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి,మండల బీజేపీ నాయకులు కుడుముల శ్రీహరి, గౌరవేణి శ్రీనివాస్,శ్రీకాంత్, రమేష్ తదితరులు పాలుగోన్నారు.