పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఉచిత న్యాయ సేవ ను వినియోగించుకోవాలి

0

*చట్టం మన చుట్టమే*
*రాజీ మార్గమే రాజా మార్గం*
*పేద  ప్రజలు ప్రతి ఒక్కరు ఉచిత న్యాయ సేవ ను వినియోగించుకోవాలి.*
◆◆జిల్లా 9వ అదనపు జెడ్జి M. జాన్సన్

హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తిచాలని చట్టం మన చుట్టమేనని, మనమంతా చట్ట పరిధిలోనే బ్రతుకితున్నామని సిరిసిల్లా జిల్లా 9వ అదనపు జెడ్జి *M. జాన్సన్*

సూచించారు.మండలాల్లోని అనంతరం గ్రామంలో ఈ రోజు ఏర్పాటు చేసి న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు,రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, హక్కులతోపాటు బాధ్యతలను విధిగా నెరవేర్చాలని అన్నారు.చిన్న చిన్న తగాధలకు పెద్దగా పోకుండా క్షమించే తత్వం ప్రతి ఒక్కరు అవలంచాలని రాజీ మార్గమే రాజమార్గం అన్నారు.
పేదల కోసం ఉచిత న్యాయ సేవ ఉంటుందని దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవలని కోరారు. ప్రజలలో ప్రతి ఒక్కరు న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవలని కోరారు. భూముల దగ్గర కానీ ఇండ్ల దగ్గర కానీ గొడవలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు.
గ్రామం పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని మరియు శరీర దారుడ్యాం కోసం ఏర్పాటు చేసిన జిమ్ చూసి చిన్నప్పటి మా గ్రామం గుర్తుకొస్తుందని గ్రామాన్ని ఇంతగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ గారిని అభినందించారు, మారుమూల గ్రామాల్లోని ప్రజలు హక్కుల గురించి తెలువకుండా ఉన్నారని, అందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. భ్రూణ హత్యలు చేయరాదని, బాలలను కార్మికులుగా మార్చి శ్రమ దోపిడీకి పాల్పడొద్దని అన్నారు. గర్భస్థ శిశువు పిండ నిర్ధారణకు పూనుకుంటే, మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం, గిరిజనుల హక్కులు, ఆస్తి హక్కు, జాతీయ ఆహార భద్రత చట్టం,సమాచారా హక్కు చట్టంపై  గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో NGO ల జిల్లా అధ్యక్షులు అడేపు వేణు,బార్ అసోసియేషన్ జనరల్ సేకరేటరీ పెంట శ్రీనివాస్,మండల పారా లీగల్ అడ్వైజర్ తంగాలపల్లి వేంకట,న్యాయవాదులు  కడగండ్ల తిరుపతి, ఆంజనేయులు, హరికృష్ణ,TPA  మెంబెర్ పారమేశ్వర్ PLV సునీత,వసంత కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రానికి విచ్చేసి అమూల్యమైన సందేశని తన విలువైన సమయాన్ని వెచ్చించినందుకు సర్పంచ్ గారు ఎం పి టి సి గారు, పాలక వర్గం మరియు గ్రామస్థులు జడ్జి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం ఏర్పాటుకు సహకరించిన గౌరవనీయులు అడ్వకేట్ శ్రీ మహేష్ గౌడ్, మరియువెంకట్ గారికి సర్పంచ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top