ఉద్యమానికి ముందు తను ఉపాధ్యాయుడే
పలకమీద పిల్లలకు అక్షరాలు దిద్దించినవాడే. పిల్లలను చూడగానే ఆరోజులు గుర్తొచ్చాయి. పిల్లలూ హోం వర్క్ చేసారా అంటూ టీచరైన రసమయి
ఈ రోజు ఇల్లంతకుంట మండలం లోని వంతడుపుల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను అకస్మికంగా తనఖీ చేసి పిల్లల చదువును తెలుసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి,గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారు
అనంతరం రసమయి మాట్లాడుతూ పాఠశాల ఆవరణను అందంగా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా స్కూల్ ఆవరణలోని మట్టి, దుమ్ము, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠశాలను తీర్చిదిద్దాలని చెప్పారు. అన్ని పాఠశాలలను నిర్ణీత సమయానికంటే ముందే శానిటేషన్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.