రెండు పడక గదుల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని సిద్దం వేణు

0
 రెండు పడక గదుల నిర్మాణం పేదల  ఆత్మగౌరవానికి ప్రతీక అని  సిద్దం వేణు
మానకొండూర్ నియోజకవర్గ   అభివృద్ధి ప్రదాత  శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్  గారి ఆదేశాల మేరకు ఈరోజు 
 ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ సభలొ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక లొ పాల్గొన్న రాజన్న సిరిసిల్ల  జిల్లా వైస్ చైర్మెన్ సిద్ధం వేణు  ప్రభుత్వం ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్లను ఇస్తామని చెప్పిన ప్రకారం మండలం లో 250 డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించిందని,అందులో భాగంగానే పొత్తూరు లో నిర్మించిన 32 రెండు పడక గదుల ఇళ్లకు లబ్ధిదారులను స్థానిక పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులను ఎమ్మార్వో  బావు సింగ్  ఎంపిక చేశారు. 137 దరఖాస్తు చేసుకున్న వారిలో 32  మందిని అధికారులు అర్హులుగా గుర్తించగా.. రిజర్వేషన్‌ నిబంధనలకు అనుగుణంగా వారి నుంచి 32 మందిని గ్రామ సభ ద్వారా ఎంపిక చేశారు
ఈ సందర్భంగా సిద్ధం వేణు గారు మాట్లాడుతూ గత 75 ఏళ్లలో తొలిసారి ‘ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా’నంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ఇల్లంతకుంట మండలంలో నిరుపేదలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తామని త్వరలో పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు  జరుపుకొన్నామన్నారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ ఎంపీటీసీ పట్నం అశ్వినీ శ్రీనివాస్, ఉప సర్పంచి బండారి పర్శరాములుగౌడ్ Pacs డైరక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి,గ్రామ రైతుబంధు అధ్యక్షులు సిద్దం నర్సయ్య 
TRS గ్రామ శాఖ అధ్యక్షులు కదురు శేఖర్   ఆర్ ఐ సంతోష్ కుమార్  స్రవంతి   రెవెన్యూ సిబ్బంది సెక్రెటరీ వార్డు సభ్యులు నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top