అవగాహన కోసమే న్యాయ విజ్ఞాన సదస్సులు
...పారా లీగల్ అడ్వైజర్ వెంకట్
చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల పారా లీగల్ అడ్వైజర్ తంగాలపల్లి వెంకట్ సూచించారు. మండలంలోని దాచారం, తెనుగువానిపల్లి, సిరికొండ, అనంతగిరి, తిప్పపూర్, పెద్దలింగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసి న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు,రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, హక్కులతోపాటు బాధ్యతలను విధిగా నెరవేర్చాలని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు హక్కుల గురించి తెలువకుండా ఉన్నారని, అందుకే న్నాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. భ్రూణ హత్యలు చేయరాదని, బాలలను కార్మికులుగా మార్చి శ్రమ దోపిడీకి పాల్పడొద్దని అన్నారు. గర్భస్థ శిశువు పిండ నిర్ధారణకు పూనుకుంటే, మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం, గిరిజనుల హక్కులు, ఆస్తి హక్కు, జాతీయ ఆహార భద్రత చట్టంపై న్యాయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్,పంచాయతీ సెక్రెటరీ లు,ప్యాక్స్ డైరెక్టర్ లు,వార్డు సభ్యులు, మహిళలు, రైతులు, యువకులు,న్యావాదులు మౌళి, కడగండ్ల తిరుపతి, బాలకిషన్, TPA మెంబెర్ పారమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు