ఈటెల రాజేందర్ గెలుపు సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ
ఈ రోజు నర్సక్క పేట గ్రామంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్ గారి గెలిచిన శుభ సందర్భంలో నర్సక్క పేట బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు దూది సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై ఈటెల రాజేందర్ అన్న గారు గెలుపు యావత్ తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషించదగ్గ విషయం తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారు మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరికీ హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పిన రోజు ఈ రోజు ఇకనైనా టిఆర్ఎస్ నాయకులు ఈ ఓటమి గమనించి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలను తీర్చిదిద్ది రైతన్నలకు నేతన్నలను గీత కార్మికులను దళితులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని లేని ఎడల ఇలాగే ఇంకా అన్ని నియోజకవర్గాలలో ఇలానే ప్రజలు తీర్పు ఇస్తారు ఖబర్దార్ కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం గ్రామ శాఖ అధ్యక్షులు నీరటి మధు బీజేవైఎం మండల అధికార ప్రతినిధి దూది శ్రీనివాస్ రెడ్డి బిజెపి మండల సీనియర్ నాయకులు బండారు శేఖర్ గౌడ్ కిసాన్‌మోర్చా గ్రామ శాఖ అధ్యక్షులు కీర్తి నరసయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.