న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కెసిఆర్ పెట్రోల్, డీజీల్ ధరలు (వ్యాట్) తగ్గించాలని ఎడ్ల బండికి కార్ ను కట్టుకొని లాగుతూ నిరసన కార్యక్రమం చేసిన మండల బీజేపీ నాయకులు..
తెలంగాణా రాష్ట్రములో పెట్రోల్, డీజీల్ పై తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి ఆదేశాలతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎడ్ల బండికి కార్ ను కట్టుకొని మండల కేంద్o అంతట లాగుతూ నిరసన చేసిన బీజేపీ నాయకులు బెంద్రం తిరుపతిరెడ్డి అధ్యక్షులు మాట్లాడతూ తెలంగాణా రాష్ట్రము లో ప్రజలకు పెనుబరమైనా పెట్రోల్, డీజిల్ పై పన్ను (వ్యాట్ ) ను తగ్గించి వాహనదారులకు ఊరట కలిగించాలంన్నారు, దేశమంతటా బీజేపీ కేంద్రం ప్రభుత్వం డీజిల్,పై 10 రు, పెట్రోల్ పై 5 రు తగ్గించి , బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వలు కూడా ధరలు తగ్గించిన, ఈ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్.గారు పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గించకపోవడం సిగ్గుచేటన్నారు, వెంటనే పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను ను తగ్గించి వాహనదారుల నుండి దోపిడీ ఆపేయాలన్నారు, లేనిచో రేపట్నుండి జిల్లాలలో 5 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ధర్నా కార్యక్రమలు చేస్తమాన్నరు,ఈ కార్యక్రమం లో వజ్జపెల్లి శ్రీకాంత్, గజ్జల శ్రీనివాస్,దూది సుదీర్ రెడ్డి,బత్తిని స్వామి, తిప్పారపు శ్రవణ్,కుడుముల శ్రీహరి, ఎళ్ళెంకి శ్రీనివాస్,దుబ్బ చింటూ,రొండ్ల మధుసూదన్ రెడ్డి ,నాగసముద్రాల సంతోష్, బెజ్జంకి శ్రీహరి,హరీస్, రాజు తదితరులు పాలుగోన్నారు.