_ఈరోజు ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్ గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్
అనంతరం రసమయి గారు మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నిర్వహించిన ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అనందంగా ఉందని అనంతగిరి గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరు కలసి కట్టుగా ఉండి ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం అని అన్నారు.చాల వరకు పల్లెల్లో చావిడిలోనే మధ్యలో, నేలలో బొడ్రాయిని ఉంచుతారు. బొడ్రాయికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుందని అన్నారు. కొన్ని గ్రామాలలో ఊరి బయట కూడా కట్టి ఉంచుతారని, చావిడిలో బొడ్రాయిని ప్రతిష్ఠ చేసి పూజిస్తారని అన్నారు. వివాహాల సందర్భాలలో ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళేటప్పుడు గానీ, బయటి ఆడపిల్లలు ఆ ఊరికి కొత్త కోడళ్ళుగా అడుగుపెట్టేటప్పుడు గానీ, బొడ్రాయిని పూజించి గ్రామం విడిచి వెళ్ళడం గానీ, గ్రామంలోకి అడుగుపెట్టటం గానీ చేస్తారని అన్నారు.