ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినసాంస్కృతిక సారతి చైర్మేన్ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్

0
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
సాంస్కృతిక సారతి చైర్మేన్ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ 
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభిగవృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మనకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ అన్నారు,గురువారం  ఇల్లంతకుంట మండల పరిధిలోని తెనుగువానిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి గారి,వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్,స్థానిక సర్పంచ్ వంచ అనసూయ చంద్ర రెడ్డి,స్థానిక ఎంపీటీసీ బర్ల తిరుపతి,నాయకులు వంచ లక్ష్మరెడ్డి,వంచ రవిందరెడ్డి, గురజాల శ్రీనివాస్ రెడ్డి,లింగం పెళ్లి బలపోచయ్య,వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కడగండ్ల తిరుపతి, హమ్మలి సంఘం అధ్యక్షుడు మల్లేశం, పల్లె,వార్డ్ సభ్యులు వెంకట్ రెడ్డి, విజయ లక్ష్మి, బాలయ్య,కనకయ్య,DCMS ఇంచార్జి మెదుడుల అనిల్ రైతులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top