రేపు నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమం చేయండి
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారి ఆధ్వర్యంలో...
నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమం రేపు అనగా
తేది:- 12.11.2021 శుక్రవారం రోజున ఉదయం⏰10.00!!గంటల నుండి మధ్యాహ్నం⏱️ 12.00 !!గంటల వరకు
మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లె మీది చౌరస్త దగ్గర కలదు.
గతంలో లాగ యదావిదిగానే కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మానకొండూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమం నిర్వహించనైనది.
కావున ఇట్టి కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లు, గ్రామ ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మరియు సభ్యులు, అన్ని గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, రైతు సంఘాల నాయకులు,అన్ని సంఘాల అధ్యక్షులు,డైరెక్టర్లు,జిల్లా మండల నాయకులు, రైతులు అందరు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి తెలిపారు.