DCMS ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

0
DCMS ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని రంగంపేట గ్రామాములో ఈ రోజు DCMS ఆధ్వర్యంలో నిర్వహింస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వైస్ చైర్మన్ సిద్ధం వేణుగారి మరియు ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి గారు చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వంద శాతం కొనుగోలు చేస్తున్నరాని, ఒకప్పుడు సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు పంటలు పండించేందుకు ఇబ్బందులు పడ్డారని, కానీ ప్రస్తుతం కాళేశ్వర ప్రాజెక్టు తో రాష్ట్రంలో కోటి ఏకరాలకు నీళ్లు అందించి సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి కృషి చేసారని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యం విక్రయించాలని ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 1960, బి గ్రేడ్ రకానికి 1940 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. దళారులకు ధాన్యం విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. 

ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి,రైతు బంధు జిల్లా డైరెక్టర్ మాధవ రెడ్డి,సర్పంచ్ సారుగు వరవ్వ, ఉప సర్పంచ్ మేడిపల్లి లక్మి భాస్కర్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ జంగిటి కొమురయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కడగండ్ల తిరుపతి,వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, రైతులు శ్రీనివాస్,మల్లారెడ్డి,మధు, మల్లయ్య,రాములు హమ్మలి సంఘం నాయకులు కొమురయ్య,భూమయ్య, DCMS ఇంచార్జి బోలగం శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top