43నెలలు గడిసిన గుర్తుకురాని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

0
43నెలలు గడిసిన గుర్తుకురాని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

న్యూస్ పవర్. డిసెంబర్.16/21. బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్.రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేస్తానని జిల్లా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారు హామీ ఇచ్చి నేటికి 43 నెలలు గడిచినప్పటికీ హామీ నెరవేర్చకపోవడంతో చెట్ల ఆకులు కట్టుకొని నిరసన  చేసిన మండల బీజేపీ నాయకులు
ఇల్లంతకుంట మండలంలో  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని  30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తాననీ హామీ ఇచ్చి నేటికి 43 నెలలు గడిచిన హామీనీ నెరవేర్చకపోవడంతో ఇక ఇల్లంతకుంట మండల ప్రజలకు ఆయుర్వేద వైద్యమే దిక్కా అంటూ మేడకు చెట్ల ఆకులను కట్టుకొని బస్టాండ్ వద్ద నిరసన చేస్తూ బెంద్రం తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడతూ.. జిల్లా మంత్రి KTR ఇల్లంతకుంట మండలనికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని తేది 16-05-2018 రోజున హామీ ఇచ్చి నేటి రోజుకీ 43 నెలలు గడిచిన హామీ నెరవేర్చకపోవడంతో మండల ప్రజలకి ఉచిత వైద్యం అందక వందలాది మంది ప్రాణాలు పోయినావి, ఇక ఇల్లంతకుంట మండల ప్రజలకు ఆయుర్వేద వైద్యమే దిక్కు అయింది అంటూ మెడకు చెట్ల ఆకులను కట్టుకొని నిరసన చేస్తుంటే జిల్లా పోలీస్ యంత్రాంగం పై ఒత్తిడి చేసి మమ్మల్ని బలవంతంగా లేపేయడం ఏంటో మీ  నియంత పాలననీ ప్రజలు గమనిస్తవున్నరన్నారు,మా మండల ప్రజల ప్రాణాలు అంటే మీకు లెక్కలేదా,30 పడకల ఆసుపత్రి గురించి అడిగితే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తావా KTR నీవు ఇచ్చిన హామీ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నీ వెంటనే మంజూరు చేసి మాట నెలబెట్టుకోవాలన్నారు,లేనిచో ప్రజాందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రొండ్ల మధుసూదన్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, జిల్లా ఓబీసీ కోశాధికారి చెప్యాల గంగాధర్,మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సలేంద్రి కరుణాకర్,బీజేపీ సీనియర్ నాయకులు దుబ్బ చింటూ, గొర్రె అఖిల్, దురుముట్ల ప్రశాంత్, అంతటి వేణు,చుక్క రమేష్,బర్ల నర్సిములు తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top