వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లొని ఈ గ్రామ లో కిష్టరావుపల్లి,రంగంపేట, కందికట్కూరు గ్రామాలలో వ్యవసాయ విస్తరణాధికారి లతశ్రీ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా యాసంగి కాలంలో FCI/GOI వాళ్లు వరి పంటను కొనుగోలు చేయo అని చెప్పి నందున మరియు వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండదు అని అంటున్న నేపథ్యంలో రైతులందరూ వరికి ప్రత్యామ్నాయ పంటల పంటలైన మినుము ,పెసర్లు ,నువ్వుల పంట సాగు పై దృష్టి సారించాలని వివరించడం జరిగినది.ఇందులో భాగంగా...
•మినుము పంటను (నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు )
•పెసర పంట (నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు)
• నువ్వులు (జనవరి 15 నుండి ఫిబ్రవరి 15) వరకు వితుకోవచ్చును అని తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి కరపత్రాలను మరియు పుస్తకాలను రైతులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ముస్కు మల్లయ్య సారుగు వజ్రవ్వ. సర్పంచ్ ,ముత్యం అమర్ , కందికట్కూరు రైతుబంధు సమితి మండల సభ్యులు తూటి పర్శరాములు మరియు రైతులు పాల్గొన్నారు.