ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు లాభాలు
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట. మండలం
వరికి బదులు ఇతర పంటల వల్ల రైతులు అధిక లాభాలు గడించ వచ్చని రైతు బంధు జిల్లా సభ్యులు యేలేటి మాధవరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రముతో పాటు నర్సక్క పేట, పత్తికుంటపల్లె గ్రామాలలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల లాభాల గూర్చి వ్యవసాయ విస్తరణ అధికారులు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా సభ్యులు మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికి బదులు పొద్దు తిరుగుడు,మొక్కజొ న్న పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు, గంగ,దొడ్ల లతశ్రీ, జ్యోతి, రైతులు పాల్గొన్నారు.