పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న పాఠశాల పూర్వ విద్యార్థి & లైన్స్ క్లబ్ వారు....
న్యూస్.పవర్. డిసెంబర్.1. బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా//
ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామములోని.జడ్ పీ హె ఎస్.పాఠశాలలో చిన్న తనంలో చదివిన విద్య ను నేర్చుకున్న తనవంతు పాఠశాల కు విద్యార్థి విద్యార్థులకు సహాయం చేయాలనే సంకల్పంతో పెద్దలింగపూర్ గ్రామానికి చెందిన గుర్రాల ముత్యం రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితం (1.40.000 )లక్ష నాలపై వేల రూపాయల ఖర్చుతో సాంస్కృతిక వేదిక ను వారి తల్లిదండ్రులు గుర్రాల మల్లవ్వ రాజిరెడ్డి జ్ఞాపకార్థం పాఠశాల లో నిర్మించి ఇవ్వడం జరిగింది.అలాగే లైన్స్ క్లబ్ మీర్పేట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. .ఇవి కాకుండా కూడా ఈరోజు. జడ్ పీ హె ఎస్.పెద్దలింగపూర్ పాఠశాల లో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు.అలాగే విటిక్ తోడు లైన్స్ క్లబ్ పెద్దలింగపూర్ గ్రామము వారు కంప్యూటర్ రూమ్ కోసం లక్ష యాభై వేల ఖర్చు తో త్వరలోనే కంప్యూటర్ ఆధునీకరణ కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. . అలాగే .ప్రతి సంవత్సరం కూడా పిల్లల అవసరాలకు పాఠశాలకు 25. వేల రూపాయలను ఇస్తామని ముత్యం రెడ్డి గారు తెలపడం జరిగింది. ఇలా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం పై ఆధారపడకుండా గ్రామంలో ఉన్న పాఠశాలలను అందరూ అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడిసెల జితేంద్ర గౌడ్ గారు ఎంపీటీసీ స్వప్న కర్ణాకర్ రెడ్డి గారు మాజీ ఎంపిటిసి గుర్రాల మల్లారెడ్డి గారు రాజ మహేందర్ రెడ్డి గారు లయన్స్ ముత్యం రెడ్డి గారు లయన్స్ క్లబ్ మెంబెర్స్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వెంకటేశ్వరరావు గారు ఎస్ ఏం సి.చైర్మన్ రాజ్ మహమ్మద్ గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కార్యక్రమ నిర్వాహకురాలు కేతిరెడ్డి సునీత గారు పాల్గొన్నారు.