ఇల్లంతకుంట గ్రామ దేవత,ఇలవేల్పు జనులందరిని నిరంతరం రక్షించే పోచమ్మ తల్లి గుడికి దారి లేక గ్రామ ప్రజలు ,భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నాయకులు మారుతున్నారు కాని పోచమ్మ గుడికి మాత్రం దారి దోరకడం లేదు.
హిందూవులు ఏ శుభకార్యం జరిగిన ముందుగా పోచమ్మ తల్లికి పూజలు చేయడం అనవాయతీ కాని అక్కడికి వెళ్ళడానికి దారి లేక భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైన ఇల్లంతకుంట గ్రామపంచాయతీపాలకవర్గం,ప్రజాప్రతినిధులు,గ్రామనాయకులు ఇట్టి దారి సమస్యను వచ్చే సంక్రాంతిపండుగలోపు పరిష్కరించి పోచమ్మ గుడికి దారినిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.