చావు డప్పు తో శవయాత్ర చేసి నిరసన తెలిపిన గొల్లపల్లి గ్రామ రైతులు...
గౌరవ రసమయి బాలకిషన్ గారి ఆదేశాల మేరకు గౌరవ ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి గారి పిలుపు తో తెలంగాణ రాష్ట్రం పట్ల బిజేపి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా,తెలంగాణ యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా తీసుకోము అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పినందుకు నిరసనగా, ఈ రోజు గొల్లపల్లి గ్రామ శాఖ తెరాస అధ్యక్షుడు పత్రి అంజయ్య గారి ఆధ్వర్యంలో *నల్ల బ్యార్జీల* ధరించి *చావు డప్పు కొట్టి* *శవయాత్ర చేసి దిష్టిబొమ్మను దగ్ధం* చేసి నిరసన తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కడగండ్ల తిరుపతి,మాజి గ్రామ శాఖ అధ్యక్షులు సొల్లు శేఖర్, ఒరుపుల రామస్వామి, యువజన సంఘం అధ్యక్షుడు రాజు, యాదవ సంఘ అధ్యక్షుడు బొప్పెన పర్శరాములు,సోషల్ మీడియా ఇంచార్జి ముద్దలా అజయ్, రైతులు చంద్రయ్య, మల్లయ్య,కొమురయ్య,భూమయ్య,మల్లయ్య,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.