రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

0

 20డిసెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని దళితలందరికి ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా దళిత కుటుంబాలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్న కేసీఆర్ ఇకనైనా దళితబంధును ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఎంఓయూ ప్రకారం తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున 94.5 లక్షల టన్నుల వరకూ సేకరిస్తామని తెలుపగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 29 లక్షల టన్నులు ఇవ్వకుండా పెండింగ్‌లో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలోనే  కేంద్రానికి తెలిపి ఇప్పుడు కేవలం రైస్ మిల్లుల కమిషన్లు కోసం రైతులను, ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ఆటలు ఇక నుండి సాగనివ్వమని బీజేపీ మండల శాఖ తరుపున హెచ్చరిస్తున్నామన్నారు. 
ఈ కార్యక్రమంలో  బీజేపీ దళిత మోర్చా మండల అధ్యక్షులు ఎలుక రామస్వామి, ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, సొల్లు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షులు తిప్పారపు శ్రావణ్, సీనియర్ నాయకులు సాయి గౌడ్, ఓబీసీ మండల అధ్యక్షులు అవినాష్ గౌడ్, ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి వజ్జేపల్లి శ్రీకాంత్, బీజేపీ నాయకులు ఎలుక వర్ధన్, చింటూ, గొర్రె అఖిల్, పవన్, సాయి, ఎలుక అజిత్, ప్రశాంత్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top