తెరాస నేతలు క్షమాపణ చెప్పాలి ప్రజా సమస్యలపై బీజేపీ నిరసనలకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టుల పేరుతో ఇబ్బందులకు గురిచేసే పోలీసులు .. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఇట్లా శవయాత్రలు చేస్తున్నా
పోలీసులకు కనిపించడం లేదా ? " అని BJYM రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఒగ్గర ముత్యం నిలదీశారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలని , కానీ రాష్ట్రంలో మాత్రం అధికార పార్టీ నాయకులతో శభాష్ అనిపించుకునేందుకు పోటీ పడుతున్నారని ముత్యం దుయ్యబట్టారు .ఇప్పటికైనా పోలీసు అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని , లేకపోతే ప్రజా వ్య తిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు .ఎప్పుడూ టీఆర్ఎస్ అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుంచుచకోవాలని అన్నారు . టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పోలీసులు దగ్గరుండి ప్రధాని మోడీ దిష్టి బొమ్మను తగుల బెట్టించారని , ఇది ఎంత వరకు కరెక్టని ఒగ్గర ముత్యం నిలదీశారు . దేశ ప్రధాని దిష్టిబొమ్మను తగుల బెట్టిన టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు వెంటనే కేసులు పెట్టాలి . దిష్టి బొమ్మను తగులబెట్టి నందుకు టీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలి ఆని డిమాండ్ చేశారు.