20డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్ర పరిధిలోని సబ్ స్టేషన్ కు ఎదురుగా 218,615,616,617 సర్వే నంబర్లలో మూడు ఎకరాల విస్తీర్ణంలో గ్రామపంచాయతీ అనుమతులు సాంకేతిక అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి అక్రమ లే అవుట్ పనులను క్షేత్రస్థాయిలో తొలగించడం జరిగింది మరియు శ్రీ దొనపాటి లక్ష్మారెడ్డి , దొనపటి రాజిరెడ్డి, దొనపాటి సంపత్ రెడ్డి గ్రామం,, మండలం,, ఇల్లంతకుంట లకు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 67 ప్రకారం దరఖాస్తు చేసుకొనుటకు నోటీసు ద్వారా తెలియజేయటం జరిగింది భవిష్యత్తులో గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేపట్టిన వారిపైన పంచాయతీ రాజ్ -2018 చట్టప్రకారం సెక్షన్ 114 ప్రకారం చర్యలు తీసుకోబడును అని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీ జోగం రాజు గారు, పంచాయతీ కార్యదర్శి మధు, ఇల్లంతకుంట గ్రామపంచాయతీ సిబ్బంది మొత్తం పాల్గొనడం జరిగింది.