బిఎస్పీ ఆద్వర్యం లో బిసి- సమ్మేళనం - పోస్టర్ విడుదల

0

ఈ నెల 26 న కరీంనగర్ జిల్లా కేంద్రం లో బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆద్వర్యం లో బిసి సమ్మేళనం ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ నిషాని రామచంద్రం తెలిపారు. ఈ రోజు ఇల్లంతకుంట బస్టాండ్  వద్ద బిసి సమ్మేళనం పోస్టర్  విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల లో జిల్లా అద్యక్షులు అడ్వకేట్ నిషాని రామచంద్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ సిద్ధాంతం ప్రకారం జనాభా దమషా న బిసిలకు రాజకీయ వాట కల్పిస్తామని పార్టీ సుప్రీం మాయావతి గారు ప్రకటన చేశారు అని అన్నారు . తెలంగాణ రాష్ట్రం లో 70 మంది బిసిలను అసెంబ్లీ కి పంపిస్తామని రాష్ట్ర ఛీఫ్ కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ సర్ అన్నారు అని తెలిపారు. 
దేశం లో బిసి గణన చేయకుండా కేంద్ర ప్రభుత్వం బిసిలను మోసం చేస్తాంది అన్నారు. రాష్ట్రం లో విద్య ఉద్యోగాల్లో బిసిలకు తీరని అన్యాయం చేస్తుంది అన్నారు. బిజెపి, కాంగ్రేస్, టిఆర్ఎస్ పార్టీ లు బిసి ల వ్యతిరేక పార్టీలు అన్నారు. ఇకనైనా బిసిలు బహుజన ఉద్యమం లోకి రావాలని అన్నారు . ఈ సభకు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ ముఖ్య అతిథిగా హజరవుతారు అన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ మంద గారు, రాష్ట్ర కో ఆర్డినేటర్లు  దేవోళ్ల గంగాధర్ సదుర్ల మళ్లేషం గారు హజరవుతారు అన్నారు. కావునా జిల్లా నుండి వేలాది గా బిసిలు హజరయ్యి విజయవంతం చేయగలరని పేర్కొన్నారు . ఈ పోస్టర్ ఆవిష్కరణ లో జిల్లా సెక్రటరి  బొనగిరి ప్రభాకర్ , అసెంబ్లీ అధ్యక్షులు సంగుపట్ల మళ్లేషం ,మండల కన్వీనర్లు మచ్చ రాజేశం గజ్జల షశి కుమార్, కుర్మ అరవింద్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top