ఈ రోజు ఇల్లంతకుంట మండలంలో మానకొండూర్ శాసన సభ్యులు & తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ డా. శ్రీ. రసమయి బాలకిషన్ సూచన మేరకు యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి- బాలరాజు ఆధ్వర్యంలో ఇల్లంతకుంట వివిధ చర్చిలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరి మణులకు పంపించిన కానుకలను పంపిణి చేసి చర్చి పాస్టర్ లకు క్రిస్టియన్ సోదరి- సోదరులందరికి..క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల తెరాస కే వి.జిల్లా అధ్యక్షులు.సవనపెళ్లి రాకేష్. ఎస్ సీ.సెల్ మండల అధ్యక్షులు పసువుల బాబు. తెరాస.పార్టీపట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు తెరాస సీనియర్ నాయకులు రజక సంఘం మండల అధ్యక్షులు.తెలంగాణ శ్రీను.చర్చి పాస్టర్ లు తదితరులు పాల్గొన్నారు.