రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లొని జంగారెడ్డి పల్లె గ్రామంలో.ఈనెల 28న మంగళవారం రోజున శాసనసభ్యుడు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిపల్లే లో ప్రారంభించబోయే కార్యక్రమాల ఏర్పాట్లను ఎంపిపి వుట్కూరి వెంకటరమణా రెడ్డి పరిశీలించారు. గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన వారసంత, భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గారి విగ్రహాం, తెలంగాణ తల్లి విగ్రహా0, సిసి రోడ్డుల ప్రారంభోత్సవం, స్మశాన వాటిక, డంపిగ్ యార్డ్, మురికి నీటి కాలువ లను ప్రారంభించనున్నట్లు ఎంపిపి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి సుధగోని శ్రీనాథ్ గౌడ్ , మాజీ ఎంపిపి ఐలయ్య ,స్థానిక సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి, ఫాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి , ఉప సర్పంచ్ ఎల్లయ్య, వార్డ్ సభ్యులు , దేవేందర్ రెడ్డి , లింగారెడ్డి , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.