ఇల్లంతకుంట వార్తలు:
ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామంలో ఈ రోజు 15 నుంచి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు
అనంతరం సిద్దం వేణు మాట్లాడుతూ 15సంవత్సరాల నుండి 18 సంవత్సరములు ఉన్న పిల్లలు తప్పకుండా వ్యాక్సినేషన్ చేసు కోవాలని.మండలంలోని అన్ని గ్రామాలలలో ప్రభుత్వ మరియు ప్రవేట్ పాఠశాలల సిబ్బంది కూడా సహకరించి పిల్లలకు తప్పకుండా టీకాలు వేయించాలని మండలంలో అన్ని గ్రామాలలో ఆయా గ్రామ ప్రజా ప్రతినిధులు వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించాలని అన్నారు..అదే విదంగా అందరు తప్పకుండా మాస్కు ధరించి,శానిటైజర్ వాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తనతో పాటు పోత్తూర్ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్,ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్,ఉప సర్పంచ్ బండారి పరుశరామ్ గౌడ్, ప్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కదిరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716.