ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ కేటీఆర్ ఇచ్చిన హామీ నేటికీ 44 నెలలు గడుస్తున్నా హామీని నెరవేర్చనీ మంత్రి ధోరణినికి నిరసనగా బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేసిన మండల BJP నాయకులు
ఇల్లంతకుంట మండల ప్రజలకు మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని జిల్లా మంత్రి KTR గారు తేది 16-05-2018 రోజున ఇచ్చిన హామీ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ 44 నెలలు గడుస్తున్నా హామీని నెరవేర్చకపోవడంతో ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో ప్లే కార్డ్స్ తో నిరసన కార్యక్రమం చేస్తూ బెంద్రం తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడతూ..జిల్లా మంత్రి KTR గారు ఇచ్చిన హామీ నెరవేర్చలాని 14 నెలల నుండి పలు నిరసనలు,మోలుకొలుపు,అబద్దాల హామీ గురించి కరపత్రాల పంపిణి, ధర్నాలు, రాస్తా రోకాలు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే జిల్లా పోలీస్ అధికారులపై ఒత్తిడి చేసి అప్రజాస్వామికంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినావు కదా నీవు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిన నీకు భయపడేది లేదన్నారు, నీవు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి, మంత్రిగా వున్నా నీ పేరు ను తొలగించుకోవాలన్నారు,తేది 30-12-21 జీ. వో నం 188 జాబితాలో ఇల్లంతకుంట మండలనికి మొండి చేయి ఇచ్చిన తెరాస ప్రభుత్వ జిల్లా మంత్రి కేటీర్ మా ఇల్లంతకుంట మండల ప్రజలకు మెరుగైనా ఉచిత వైద్యం అందించించేందుకు మా చివరి శ్వాస వున్నంతవరకు పోరాడ్తామన్నారు,మండల తెరాస ప్రజాప్రతినిధులు మీరు మన మండల ప్రజలకు ఉచిత వైద్యం అందెందుకు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కావాలా వద్దా ప్రజలకి చెప్పాలన్నారు, మీరు భయపడి మౌనం ఉండి సామాన్య పేద ప్రజలకి అత్యవసర పరిస్థితిలలో ఉచిత అందక చనిపోయిన మీరు నోరు మేదపారెంటన్నారు, మీ మౌనం వలన మండలంలో ఉచిత వైద్యం అందక పేద ప్రజలు చనిపోయిన కుటుంబాల పాపం, ఉసురు తగులుతుందన్నారు, వెంటనే కేటీర్ ఇచ్చిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా obc మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు,మండల obc మోర్చా ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, bjym ఒగ్గరి.ముత్యం అధికారప్రాతినిధి చల్లూరి.భాను, అంతటి.వేణు, దురుముట్ల ప్రశాంత్, శ్రీకాంత్, యాస సన్నీ, సాయి, చుక్క రమేష్ తదితరులు పాలుగోన్నారు.