ఇల్లంతకుంట మండలానికి అందని 30 పడకల ఆసుపత్రి

0

 ౼ మండలనికి 30 పడకల ఆసుపత్రి తీసుకరావడానికి విఫలం అయిన మండల నాయకులు..

౼ 30 పడకల ఆసుపత్రిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్.. నాగసముద్రాల సంతోష్ 
మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి

ఇల్లంతకుంట వార్తలు:
2018 లో జిల్లా మంత్రి కేటీఆర్ గారు ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పిన కేటీఆర్ గారికి సామాన్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేస్తూ గత 20 నెలలుగా బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల నాయకుకు నిరసనలు తెలిపుతున్నప్పటికి  చలనం లేని రాజకీయ నాయకులు తమ ఉనికి ప్రజలలో ఎక్కడ పోతుందో అని అభద్రత భావంతో బీజేపీ నాయకులపై ఇప్పటి వరకు పలు అక్రమ కేసులు పెట్టించి, జైలుకు కూడా పంపించారు...  కేటీఆర్ హామీ ఇచ్చాడు 30 పడకల ఆసుపత్రి ఇస్తాడని, కావాలనే బీజేపీ నాయకులు నిరసనలు చేస్తున్నారని అనాలోచితంగా ఆరోపణలు చేస్తూ మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఏమైంది  చివరిగా నాయకుల ఏమరుపాటుతో మరియు మండల ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యం తో మన మండలానికి పక్కన మండలాలకు  30 పడకల ఆసుపత్రి వచ్చింది, మన మండలానికి మొండి చేయి చూపించారు.     ఇప్పటికైనా మంచి పనులను రాజకీయంగా చూడకుండా ప్రజలకు ఉపయోగడపడుతుందా లేదా అనే ధోరణిలో చూడాలని మీ అలసత్వం తో ప్రజల ఓట్లతో గెలిచిన మీరు 30 పడకల ఆసుపత్రి తీసుకోనిరావడంలో విఫలం అయినందున మీరు వెంటనే మీ పదవులకు రాజీనామా చేసి మాతో రండి... హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిన కేటీఆర్ కి గుణపాఠం చెప్పేలా త్వరలోనే బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజల మద్దతుతో 30 పడకల ఆసుపత్రి నిర్మించే వరకు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని, హామీ నెరవేర్చని కేటీఆర్, ఎమ్మెల్యే గార్లను  బీజేపీ మండల శాఖ నాయకులు ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని తెలుపుతున్నాము.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top