స్వయం ఉపాధి శిక్షణ తరగతులను సద్వినియోగ పరచుకోండి
- ఎంపిపి వుట్కూరివెంకట రమణారెడ్డి
ఇల్లంతకుంట వార్తలు :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సి. ఆర్ .ఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ తరగతులను. ఉచిత మొబైల్రిపేరింగ్ ,మార్కెటింగ్, శిక్షణ కేంద్రాన్ని. ఎంపీపీ రమణారెడ్డి , సర్పంచ్ శ్రీ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు ప్రారంభించడమయినది , అనంతరం.
ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ఎంపీపీ రమణారెడ్డి మాట్లాడుతూ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఈ కేంద్రం ద్వారా అనేక నూతన మెళుకువలు నేర్చుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునని ప్రభుత్వం ఇచ్చే ఇటువంటి పథకాలను సద్వినియోగం చేసుకొని సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించువడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుదని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఈ కేంద్రం ఇల్లంతకుంట లో ఉండడం ఎంతో అదృష్టమని ఇల్లంతకుంట గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఆర్ ఎస్ డైరెక్టర్ మూర్తి ,అనిల్ రెడ్డి , సెంటర్ నిర్వాహకులు శారద, అనంతారం ఎంపీటీసీ తీగల పుష్పలత వల్లంపట్ల ఎంపీటీసీ నాయిని స్రవంతి రమేష్. ఏలేటి మాధవరెడ్డి. సావనపెల్లి రాకేష్. రఘు సరిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.