ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షులు ఎలుక రామస్వామి ఆధ్వర్యంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారి పిలుపు మేరకు పంజాబ్ రాష్ట్రంలో పర్యటనలో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిపై దాడి చేయాలనే ఉద్దేశంతో దేశద్రోహులు నరేంద్రమోడీ గారి కాన్వాయ్ అడ్డుకోవడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మాట్లాడుతూ గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశానికి సర్వస్వాన్ని అర్పించి దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం రోజులో 18 గంటలు నిర్విరామంగా పని చేస్తూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ ప్రజల క్షేమమే ధ్యేయంగా, శత్రు దేశాల నుండి ఎప్పటికప్పుడు దేశాన్ని రక్షిస్తూ దేశ రక్షణ, అభివృద్ధి కోసం పని చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని లేనియెడల పంజాబ్ ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులకు దేశ క్షేమం కంటే అధికారమే లక్ష్యంగా దేశ ద్రోహుల కు మద్దతుగా నిలబడడం దేశ రక్షణ పట్ల కాంగ్రెస్ నాయకుల వైఖరి స్పష్టంగా కనబడుతుంది అని తెలిపారు కాంగ్రెస్ రానున్న రోజుల్లో పూర్తిగా కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమని తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం,ఎలుక వర్ధన్, దాసరి శ్యామ్, దాసరి అజిత్,ముడపల్లి కోటి లు తదితరులు పాల్గొన్నారు.