ఇల్లంతకుంట వార్తలు:
ఇల్లంతకుంటమండలంలోనిరేపాక,సోమారంపేట,వెంకట్రావుపల్లె,గొల్లపెల్లి,జంగారెడ్డిపల్లె,ఇల్లంతకుంట,ముస్కానిపేట,గాలిపెల్లి,తాళ్లపెల్లి,పత్తికుంట పల్లె గ్రామాలలో 22మందికి 22లక్షల2వేల 552రూపాయల కాళ్యాణ లక్ష్మి చెక్కుల పంఫిణి చేయడం జరిగిందని అన్నారు.కులం ఏదైనా మతం ఏదైనా ప్రతీ పేదింటి తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెండ్లి భారం కావద్దన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకం.ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తలకు మించిన భారం అవుతున్న సందర్భంలో రూపాయి రూపాయి కూడబెడితే తప్ప ఆడపిల్ల పెండ్లి తంతు అవటం లేదు
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లంటే జీవితకాలం కూడబెట్టాల్సిందే.అందుకే పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాన్ని తీసుకు వచ్చింది.1,00,116 రూ!!వివాహ కానుకగా అందిస్తూ ఆడబిడ్డ తల్లిదండ్రుల ఇంట ఆనందాలు కురిపిస్తుంది అని అన్నారు.మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఇలాంటి గొప్ప కానుకలు ఇవ్వడం లేదు అని అన్నారు.
ఈ కార్యక్రమం లో జడ్పీవైస్ ఛైర్మెన్ సిద్దం వేణు, ఎంపీపీ రమణారెడ్డి, RBS మండల అధ్యక్షులు చేరుకుపెల్లి రాజిరెడ్డి, పాక్స్ ఛైర్మెన్ రొండ్ల తిరుపతి రెడ్డి, తెరాస మండల అధ్యక్షులు పల్లె నర్సింహారెడ్డి, అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షులు తడుకపెల్లి భూమయ్య,
వివిధ గ్రామాల సర్పంచ్ లు , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డ్ సభ్యులు ,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.