ఇల్లంతకుంట వార్తలు:
ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోని అంభేడ్కర్ సంఘ భవనంలో పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్.ఈ సందర్భంగా గొడిశెల జితెందర్ గౌడ్ మాట్లాడుతూ సమానత్వం,సమసమాజం స్థాపనకై రాజ్యాంగంలో పొందు పరిచిన వివిధ చట్టాలను మరియు రాజ్యాంగంలో పౌరహక్కులకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకోవాలని అన్నారు.పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కుల వివక్ష లేకుండా గ్రామంలో సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు... SC,ST సబ్ ప్లాన్ కమిటి మెంబర్ పసుల బాల్ రాజ్ సన్మానించినారు.అనంతరం డబుల్ బెడ్ రూంల దగ్గర వాటర్ ట్యాంక్ కొరకు భూమి పూజ చేసినారు
ఈ కార్యక్రమంలో వారితో పాటు MPTC కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,ASI వెంకటేశ్వర్ రెడ్డి,MPDO రాజు,RI,VRO,EX.MPTC గొల్ల మల్లారెడ్డి,అంభేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు తడకపెల్లి భూమయ్య,SC ST సబ్ ప్లాన్ కమిటి మెంబర్ పసుల బాల్ రాజ్,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి,గ్రామ అంభేడ్కర్ సంఘం అధ్యక్షులు మాంకాలి శ్రీను,సంఘ సభ్యులు పాల్గొన్నారు.