బొల్లం సాయిరెడ్డి మండలం రిపోర్టార్. న్యూస్ పవర్. జనవరి.20/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ.
మండలంలోని పలు గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ ఎన్రోలర్స్ తో సమావేశమై కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు.
ఈ సందర్భంగా డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొందిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు .
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరిచాలన్నారు.
బూత్ కి 100కి పైగా సభ్యత్వ నమోదు పూర్తి చేసిన బూత్ ఎన్రోలర్స్ ని సన్మానించారు .
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ అన్ని గ్రామాల ఎన్రోల్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి జనరల్ జనరల్ సెక్రెటరీ అల్లె పు రజనీకాంత్ అనంతగిరి గ్రామ శాఖ అధ్యక్షులు గ కోలలపూడి అంతగిరి మండల యువజన నాయకులు మామిడి నరేష్ సురేందర్ రెడ్డి దయాసాగర్ చందు రామకృష్ణారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల మల్లారెడ్డి సురేందర్ రెడ్డి బడుగు లింగం నేత బాబు నరసింహారెడ్డి మల్లేశం స్వామి రమణారెడ్డి బాల పోశయ్య మంజూర్ అలీ ముజాఫర్ తిరుపతి భాస్కర్ భగవాన్ బత్తిని నారా గౌడ్ చిట్టి ఆనందరెడ్డి లక్ష్మణ్ రాజి రెడ్డి రాజు యాదవ్ పాల్గొన్నారు.