ఎస్సి కార్పొరేషన్ ద్వారా పాడి పశువుల కోసం సబ్సిడీ రుణాలు

0
 ఇల్లంతకుంట వార్తలు:
ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయము, ఇల్లంతకుంట లో SC Corporation  లొ సబ్సీడి కింద 2 పాడి గేదెల రుణానికి సంబంధించి . ఇల్లంతకుంట మండలానికి సంబంధించి 59 మంది లబ్ధిదారుల జాబితాను అందజేయడం.  ఎస్సీ కార్పొరేషన్, విజయ డైరీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సహకారంతో ఇట్టి కార్యాక్రమము జరిగినది. ఈరోజు దాదాపు 50 మంది లబ్ధిదారులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఇల్లంతకుంట మండలంలో 100 మంది లబ్ధిదారుల లక్ష్యం ఉండగా అందులో 59 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిన 41 మంది లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.   జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మిగిలిన 41 యూనిట్లకు గాను లబ్ధిదారులు  దరఖాస్తు ఫారమ్‌తో రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తు ఫారాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా SC కార్పొరేషన్ రాజన్న సిరిసిల్లలో సమర్పించవచ్చు. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, 1బీ ఫారం, 2 పాస్‌పోస్టు సైజు ఫొటోలు జతచేయాలని ఎంపీడీఓ తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top