వల్లంపట్ల గ్రామంలో అంబరాన్ని అంటిన రైతు బంధు సంబరాలు

0

ఇల్లంతకుంట వార్తలు:
 రాజన్న సిరిసిల్ల. జిల్లా ఇల్లంతకుంట మండలం. వల్లంపట్ల గ్రామంలో. ఊరూరా రైతు బంధు సంబరాల్లో భాగంగా నేడు వల్లంపట్ల గ్రామంలో  సర్పంచ్ కేతిరెడ్డిఅనసూయ - వెంకటనర్సింహ రెడ్డి  అధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు 
రైతు బంధుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ...
ముఖ్యమంత్రి కేసిఆర్.కి ,  ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కు కృతజ్ఞతలు తెలిపి రుణపడి ఉంటామన్నారు.

 ఈ సందర్భంగా  సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ  మాట్లాడుతూ  అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రైతుబంధు పథకం.. ఈ జనవరి 10 లోపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతు బంధు పథకం ద్వారా మొత్తం రూ.50 వేల కోట్లు జమ చేస్తుందని గుర్తు చేశాడు ....
ప్రతీ రైతుకు రైతు బంధు వచ్చె రైతుల కళ్ళల్లో ఆనందాన్ని తెచ్చె అన్నారు ....

వల్లంపట్ల రైతువేదిక లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాయిని స్రవంతి - రమేష్ గారు,ఉపసర్పంచ్ , వార్డ్ సభ్యులు , రైతు సమన్వయసమితి అధ్యక్షులు గజ్జెల రాజశేఖర్, మాజీసర్పంచ్ మేకల శ్రీనివాస్ , ఎ ఈ ఓ.వంశీ గారు,అంగన్వాడీ టీచర్లు,ఎ ఎన్ ఎం.లు,ఆశ వర్కర్లు,వి ఓ.అధ్యక్షులు, మహిళలు, రైతులు, కారోబార్, పంచాయితీ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని ముగ్గుల పోటీల్లో గెలిచిన ముగ్గురు విజేతలకు మొదటి విజేత కొత్తపెల్లి వీణకు 1500,రెండవ విజేత గుర్రం శారదకు 1000, మూడవ విజేత మళ్ళమారి శ్రావణికి 500 రూపాయల నగదు సర్పంచ్ అనసూయ గారు స్వయంగా అందజేయడం జరిగింది.

-----------------------------------------------------------------------

ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి మీకు స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top