సామాజిక సేవా దృక్పథం స్ఫూర్తిదాయకం _ లయన్స్ క్లబ్ వారిని అభినందించి సన్మానించిన సర్పంచ్ గొడిశెల జితందర్ గౌడ్

0


ఇల్లంతకుంట వార్తలు:
ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆఫ్ హైదారాబాద్ మీర్ పేట్ గారి ఆద్వర్యంలో  సుమారు 2లక్షల రూపాయల కంప్యూటర్స్అందించారు.
అదేవిదంగా స్థానిక సర్పంచ్  గొడిశెల జితెందర్ గౌడ్  కంప్యూటర్స్ కు సంబందించినవి మరియు ల్యాబ్ కు తన స్వంత ఖర్చులతో సుమారు 35000/-రూ!!లతో రూం పాల్ సీలింగ్ ,కరెంట్ పిటింగ్ మరియు కంప్యూటర్ డెస్కులు చేపిచ్చినారు. గుర్రాల ముత్యం రెడ్డి పాఠశాలకు కార్పస్ ఫండ్ రూపంలో తన వంతుగా 25000/-రూ!!వాల్ల కుతుళ్లు విజేత - సాకేత్ రెడ్డి  25000/-రూ!! ప్రధానోపాద్యయులు  చింతపెల్లి వెంకటేశ్వర్ రావు కి అందించారు.. అదే విదంగా నిరుపేద విద్యార్థి వెగ్గళం స్వాతికి గుడిగంటల రాములు 1000/-రూ!! కృష్ణ ప్రసాద్ 500/-రూ!! ఇచ్చుకుంటూ ప్రతి నెల ఆమె చదువుకై వారి జీవితాంతం అందజేస్తామని అన్నారు.

 స్థానిక సర్పంచ్ శ్రీ గొడిశెల జితెందర్ గౌడ్ గారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని లైన్స్ క్లబ్ ఆఫ్ హైదారాబాద్ మీర్ పేట్ వారితో కలసి కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించినారు.

అనంతరం సర్పంచ్  గొడిశెల జితెందర్ గౌడ్  మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథం స్ఫూర్తిదాయకమని, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనలో విస్తృత సేవలందిస్తున్న లయన్స్‌ క్లబ్‌ సేవలు ఆదర్శనీయమని అన్నారు.లయన్స్‌ క్లబ్‌ వారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు అని తెలిపారు. సామాజిక దక్పథంతో సేవ చేయడానికి ముందుకు వచ్చిన లయన్స్‌ క్లబ్‌ వారి ఔదార్యం ఎంతో గొప్పదని అన్నారు.కనీస వసతులు లేని స్కూల్‌కి పిల్లల్ని పంపేందుకు ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు.అందుకే తమ పిల్లల్ని వేరే పాఠశాలల్లో చేర్పించడం_ _మొదలుపెడుతారు. దాంతో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గు ముఖం పడుతుంది.అలా కాకకుండ ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలకు దీటుగ ఉండాలనే ఉద్దేశంతో పాఠశాలలో పిల్లలకు ఏలోటు రాకుండా చూస్తానమని అన్నారు.

మరో ముఖ్య అతిథి వైస్ డిస్టిక్ గవర్నర్ లైన్స్ సి.వెంకటనారాయణ రెడ్డి  మాట్లాడుతూ మేము గ్రామ పాఠశాలకు అన్ని వేళల అందు బాటులో ఉంటామని,ఎలాంటి సేవకైన మా లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్ పేట్ తరుపున సహయం అందించాటానికి సిద్దంగా ఉంటామని అన్నారు.మీ గ్రామ యువ సర్పంచ్  గొడిశెల జితెందర్ గౌడ్  ఉత్సావంతుడుని మా తోటు పాటు తాను కూడా బాగసౌమ్యుడై తన వంతుగా కూడా అభివృద్ది కొరకు తను స్వంతంగా ఖర్చు పెట్టడం అభినందనీయమని అన్నారు..అలాగే ఈ పాఠశాలలో ఉపాద్యాయిని కేతిరెడ్డి సునిత  తన స్వంత గ్రామం ఇదే కాబట్టి గ్రామం మీద ఉన్న మమకారంతో పాఠశాలను డెవలఫ్ చేయని అను నిత్యం పాఠశాల అభివృద్ది కొరకు,పిల్లలకు భవిష్యత్త్ కొరకు ఆరాటపడం చాల అభినందనీయమని అన్నారు.కేతిరెడ్డి సునిత లాంటి ఉపాద్యాయిని మీ పాఠశాలకు రావడం చాలా అదృష్టమని_ అన్నారు.

అనంతరం స్థానిక సర్పంచ్ శ్రీ గొడిశెలం జితెందర్ గౌడ్ ని మరియు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర రావు ని,ఉపాద్యాయిని శ్రీమతి కేతిరెడ్డి సునిత ని సన్మానించిన లైన్స్ క్లబ్ సభ్యులు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు వైస్ డిస్టిక్ గవర్నర్ లైన్స్ సి.వెంకటనారాయణ రెడ్డి ,లైన్స్ క్లబ్ సభ్యులు గుర్రాల ముత్యం రెడ్డి,ఓ.మునిరత్నం.కృష్ణ ప్రసాద్,CH.మొగిళి గౌడ్,నర్ర జగదీశ్వర్ రెడ్డి,బి.సూర్యప్రకాష్, స్థానిక నాయకులు గొల్ల మల్లారెడ్డి ,మీసరగండ్ల అనిల్ కుమార్
 ప్రధానోపాద్యాయులు  చింతపెల్లి వెంకటేశ్వేర రావు,కేతిరెడ్డి సునిత,కనుకయ్య,వీరాస్వామి,యాదగిరి,రవిందర్ నాయక్,పద్మలత,సమత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top