భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశల చాటిన స్పూర్తిదాత యువతకు మార్గదర్శకులు స్వామి వివేకానంద

0
భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశల చాటిన స్పూర్తిదాత యువతకు మార్గదర్శకులు స్వామి వివేకానంద 
           సిద్దం వేణు
రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మన్
 ఇల్లంతకుంట వార్తలు:
స్వామి వివేకానంద 159వ జయంతి సంధర్భంగా ఈ రోజు ఇంల్లంతకుంట మండల కేంద్రంలోని రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మేన్  సిద్దం వేణు తన కార్యాలయంలో  స్వామి వివేకనందుడి చిత్రపటానికి పూల మాల వేసినారు.

అనంతరం  సిద్దం వేణు మాట్లాడుతూ స్వామి వివేకానంద  యువకులను ప్రోత్సాహిస్తూ,యువకులారా నా ఆశలన్నీ మీపైనే,నా మాటను విశ్వసించే ప్రతి ఒక్కరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇనుప కండరాలు, ఉక్కునరాలు, పిడుగులాంటి శక్తివంతమైన మనస్సును కలిగివుండండి. ఇదే నేను మీకిచ్చే సలహలు చూచనలు అని అనేవారన్నారు.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యువతను తన ప్రసంగాలతో చైతన్య పరచిన గొప్ప తత్వవేత్త స్వామి వివేకంద  అని అన్నారు.

భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద స్వామి గారు అని అన్నారు.భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారని అన్నారు.ఇండియాలో హిందు మతంలో కీలక సంస్కరణలు, మార్పులకు వివేకానంద స్వామి గారు శ్రీకారం చుట్టి భారతీయుల్లో ఐక్యతను పెంచారని అన్నారు. జాతీయతా భావాన్ని తట్టిలేపి ఆయన బోధనలు, సందేశాలూ అప్పట్లో యువతను సన్మార్గంలో నడిపించాయి అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ఇల్లంతకుంట మాజీ సర్పంచ్ మామిడి సంజీవ్ ,మండల కో ఆప్సన్ సభ్యుడు MD.సలీం,మండల యూత్ అధ్యక్షులు సూర్య గౌడ్, సావపెళ్లి రాకేష్, రఘు,ఉస్మాన్,కిషన్,చందన్, పొన్నాం శేఖర్,ప్రశాంత్ రెడ్డి,శ్రవణ్,తిరుపతి, నాగరాజు,బాబు,బర్ల రమేష్,రాజు,సావనపెల్లి శెంకర్, ఇమ్రాన్, వెంకటేష్, సమీర్,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------

ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి మీకు స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top