డాక్టర్ రాకపోయినా వచ్చినట్లు రికార్డ్ లో సంతకాలు

0
.
ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల వెంకటి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లు లేక  గర్భిణీ స్త్రీలు గానీ సామాన్య ప్రజలు గాని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకానొక డాక్టర్ గారు ఈ ఆస్పత్రిలో ఉంటే ఆమె సొంతంగా క్లీనిక్ పెట్టుకోవడం జరిగింది వారానికి ఒక రోజు కూడా వస్తదో రాదో  మండల ప్రజలకు తెలియదు .

ఆమె రా లేని రోజు నాడు కూడా రిజిస్టర్ లో కిందిస్థాయి అధికారులు సంతకం పెట్టడం జరుగుతుంది ఇదేంది ఆమె రాలేదు కదా అని అడిగితే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని దాటవేయడం చేస్తున్నారు డిసెంబర్ 2001 లో 14 తారీకు నుండి 21 తారీకు వరకు డాక్టర్ గారు హాస్పిటల్ లో లేరు అయినా రిజిస్టర్ మాయమైనది    03.01.2022 రోజుల డాక్టర్ గారు హాస్పిటల్ లో లేరు అయినా రిజిస్టర్ లో ఆమె సంతకం యున్నది ఎట్లా ఉన్నది అంటే కింది స్థాయి అధికారులు సంతకం పెట్టడం జరుగుతుంది.

 డాక్టర్ గారు నెల నెల జీతాలు తీసుకోవడమే తప్ప మండల ప్రజలకు సేవ చేయడం లేదు రావడం లేదు ఆమె సొంతంగా పెద్దపెల్లి.లో క్లినిక్ పెట్టుకున్నది    ఇది మండల ప్రజాప్రతినిధులకు తెలియదా తెలిసినా తెలియనట్లు ఉంటున్నారా కొంతమంది ప్రజాప్రతినిధులకు ముడుపులు ముడుతున్నాయి తెలిసింది అందుకనే డాక్టర్గారిని పట్టించుకోవడం లేదు డాక్టర్ గారు వచ్చినా సరే రాకపోయినా సరే అని మండల ప్రజాప్రతినిధులు కొంతమంది భావిస్తున్నారు.

 ఈరోజు మోడల్ స్కూల్ రహీంఖాన్ పేట లో  పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఒక అమ్మాయికి కొద్దిగా ఇబ్బంది జరిగింది డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళ్ళమంటే పీహెచ్సీలో డాక్టర్ గారు లేరు ఎట్లా అని అడిగితే వస్తది వస్తది అని చెప్పుకోవడం తప్ప రావడం లేదు అధికార పార్టీ నాయకులు ఇల్లంతకుంట మండలం లో ఉన్నట్లు మరి లేదా వారు ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రజలకు జవాబు చెప్పాలి కొంతమంది కిందిస్థాయి అధికారులు ఆమెకు సపోర్ట్ గా రాకుండా వచ్చినట్టు సంతకాలు పెట్టడం ఇది కరెక్ట్ కాదు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి  .

 మండల ప్రజా ప్రతినిధులు ఒకసారి దృష్టిపెట్టి ఆలోచన చేయమని కోరుతున్నాము30 పడకల ఆసుపత్రి లేనేలేదు రానే రాలేదు  ఉన్న డాక్టర్ అయినా సరే రోజు వస్తది అనుకుంటే ఈమె సొంత క్లినిక్ హాస్పిటల్ పెట్టుకున్నది ఇక్కడ జీతం తీసుకుని ఎక్కడో సొంత ప్రయోజనాల కోసం పని చేయడం జరుగుతుంది పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ ఒక్కటై ఇల్లంతకుంట మండలం ప్రజలను హింసిస్తున్నారు .

కావున మండల ప్రజాప్రతినిధులు అందరు ఒక్కటై ఇటు వంటి డాక్టర్ను పని చేయని వ్యక్తిని ఇక్కడి నుండి తొందరగా పంపియ వలసిందిగా అధికార పార్టీ నాయకులను స్థానిక మానకొండూరు శాసనసభ్యులు గారిని అడగడం జరుగుతుంది ఇకనైనా హాస్పిటల్ను సందర్శించి డాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో యువజన నాయకులు మామిడి నరేష్  జమాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top