రైతు పక్షపాతి కేసీఆర్

0
రైతు పక్షపాతి కేసీఆర్
   ౼ సిద్ధం వేణు
రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్
ఇల్లంతకుంట వార్తలు:
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా  తెలంగాణ రాష్ట)సాంస్కృతిక సారతి చైర్మేన్  మానకొండూర్ శాసన సభ్యులు 
డాక్టర్  రసమయి బాలకిషన్  ఆదేశాల మేరకు ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని పొత్తుర్ గ్రామంలో  రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్  సిద్దం వేణు మరియు  గ్రామ రైతులు
   ముఖ్యమంత్రి కేసీఆర్,అని వరి నారుతో
పొలంలో వ్రాసి మరియు కేసిఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

అనంతరం  సిద్ధం వేణు మాట్లాడుతూ వ్యవసాయం ప్రధానాధారమైన జిల్లాలో రూపాయి రాక మొదలయ్యేది ప్రధానంగా పల్లె నుంచేనని కర్షకుడి చమట చుక్క నుంచి పుట్టే రూపాయి లోకమంతా తిరిగి అన్ని వర్గాల ప్రజలకూ భరోసాను కల్పిస్తుందని అన్నారు. వ్యవసాయం బాగున్న రోజుల్లోనే వ్యాపారాలు, కొనుగోలు శక్తి మెరుగ్గా ఉంటుండడమే ఇందుకు నిదర్శనం అన్నారు. అలాంటి అన్నదాతకు దన్నుగా నిలిచిన  ముఖ్యమంత్రి KCR  వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి రైతుబంధు పథకం ప్రవేశపెట్టారని అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు గుండెలకు హత్తుకుంటున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో  రైతు బంధు పథకం లేదని తెలంగాణ రాష్ట్రంలోనే రైతుకు పెట్టుబడి నుంచి ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్  అని కెసిఆర్  తెలంగాణ రైతులకు అవినాభావ సంబంధం అని ఆత్మబంధువు సంబంధం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు పోత్తూరు సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్  ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్ , రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ సిద్ధం నర్సయ్య ,PACS డైరెక్టర్ చెరుకు శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ బండారి పర్శరాములు గౌడ్ ,TRS గ్రామశాఖఅధ్యక్షులు కదురు శేఖర్ , TRS మండల ఉపాద్యక్షులు పుట్ట కుమార్, రైతులు కధురు రవి , కదురు రాజేశం, రోoడ్ల కర్ణకార్ రెడ్డి , గుంటి ఆంజనేయులు, ఆకుల మహేందర్, బండారి మహేష్, కోల రాజు, సిద్ధం సాగర్, బండారి అమర్, గుంటి మొండయ్య, పట్నం  మహేందర్, గుంటి మధు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top