ఇల్లంతకుంట వార్తలు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకట్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
మరియు జెండా ఎగరవేయడం జరిగింది. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడుస్తున్నా దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఇప్పుడు పాలించే పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరం దళితుల అభ్యున్నతి కొరకు ఆనాటి కాంగ్రెస్ గౌర్నమెంట్ ఎన్నో సంస్కరణలు తెచ్చి దళితుల్లో వెలుగు నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వక్తలు కొనియాడారు జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ సెక్రెటరీ ముత్యాల మల్లారెడ్డి మానకొండూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్ కుమార్ ఇల్లంతకుంట టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నేరళ్ల విజయ్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రోజు సంతోష్ మండల బీసీ సెల్ అధ్యక్షులు వీరేశం మండల జనరల్ సెక్రెటరీ అల్లెపీ రజనీకాంత్ సీనియర్ జిల్లా నాయకులు ఒగ్గు రమేష్ మండల ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి మండల సీనియర్ నాయకులు ఎలుక అనిల్ సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.