అర్హులైన నిరుపేదలకునిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది

0


ఇల్లంతకుంట వార్తలు.జనవరి.24/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం లో  రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు గానీ డబుల్ బెడ్ రూమ్ గానే దళిత బందు గాని మూడెకరాల భూమి గాని ఏవైనా ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న పార్టీ కండువాలు కప్పుకున్న పార్టీకి పని చేసే వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమైన చర్యగా గుర్తించడం జరుగుతున్నది ఇల్లంతకుంట మండలంలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది  నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించకపోవడం మంచి పద్ధతి కాదు ఇకనైనా అధికారులు దృష్టిసారించి మళ్లీ ఇల్లంతకుంట మండలంలో అన్ని గ్రామాలలో రీ సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం


 ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ వల్లెపు రజినీకాంత్ మానకొండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రోళ్ల సంతోష్ కుమార్ మండల ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి మండల యువజన నాయకులు మామిడి నరేష్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది .

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top