ఇల్లంతకుంట వార్తలు, 03డిసెంబర్ :
SFI (భారత విద్యార్థి ఫెడరేషన్) ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుల తల్లి సావిత్రి బాయి పూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించటం జరిగింది.
ఈ సందర్భంగా sfi మండల కార్యదర్శి సొల్లు సాయి కుమార్ మాట్లాడుతూ...
దేశంలో నెలకొన్న కులవ్యవస్థ కారణంగానే భారతదేశం వెనకబడి పోయిందని గుర్తించిన సావిత్రిబాయి ఫూలే జ్యోతిబా ఫూలే దంపతులు కుల వ్యవస్థ నిర్మూలన కోసం జీవితాంతం పాటుపడ్డారని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా కారణంగానే ఈ దేశంలో కుల వ్యవస్థ నెలకొందని, జ్యోతిబాఫూలే సావిత్రిబాయి పూలే ల త్యాగనిరతితో కృషి చేసి కులవ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారని పేర్కొన్నారు. నిమ్నవర్గాలు స్త్రీల విద్య కోసం పాటుపడిన సావిత్రిబాయి ఫూలే ను అగ్రవర్ణ దురహంకారులు అడుగడుగునా అవమానించారని ఆయన తెలిపారు. మహాత్మా ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ కారణంగానే సమాజంలో చైతన్యం వెల్లివిరిసిందని ఆయన పేర్కొన్నారు.
నేటి యువత ఫూలే దంపతుల వారసత్వాన్ని నిలుపుతూ మనువాద - మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పేర్కొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కిన సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్నే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో sfi మండల నాయకులు జంపాల అక్షయ్,కడగండ్ల వినిత్,మంద అనూష,నందిని,కుంటల సాయి,అచిత్ విద్యార్థులు పాల్గొన్నారు.