ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ సెల్ : 9392548716
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GO 317 ను వెంటనే రద్దు చేయాలనీ 317 జీ వో కాపీలను దహనం చేసిన మండల బీజేపీ నాయకులు.
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసిన 317 జీ వో కాపీలను ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో దహనం చేస్తూ బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడతూ తెలంగాణా రాష్టంలోనీ ఉపాధ్యాయ,ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు గురిచేసేందుకు కెసిఆర్ గారు 317 జీ వో ను తీసుకొచ్చి ఉద్యోగులను నివాస జిల్లాలో ఉండకుండా భార్య భర్తలను, తల్లి పిల్లల నుండి విడాతీసేవిధంగా కుట్రతో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేస్తూన్నా కెసిఆర్ ఉద్యోగులకు జన్మ స్థానాలు, నివాస స్థానాలు లేకుండా గర్భణి స్త్రీలు అనే మానవత్వం లేకుండా దూరప్రాంతాలకి పంపించటంఏంటన్నారు, మహిళ పోలీస్ స్టేషన్ లలో కనీసం మహిళా పోలీస్ లు లేకుండా చేసిన ఈ జీ వో ను వెంటనే రద్దు చేయాలన్నారు, ఉపాధ్యాయ, ఉద్యోగులు 317 తప్పుడు జీ వో ను రద్దు చేయాలనీ మహా ధర్నా కార్యక్రమనికి హైదరాబాద్ చేయడానికి వెళ్లనీయాకుండా జిల్లాలలో పోలీస్ లచే అడ్డగింపించి, నిర్భందించి రాజన్న సిరిసిల్ల జిల్లా లో కూడా పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలనీ మండిపడ్డారు, పోలీస్ అధికారులు కూడా మీరు ఒక్కసారి పునరాలోచించాలి మీరు ఉద్యోగులే కదా ఈ జీ వో వాళ్ళ మీరు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్తున్నారు కదా, మానసికంగా ఎంత ఆందోళన చెందుతున్నారన్నారు తక్షణమే 317 జీ వో నీ రద్దు చేసి ఉపాధ్యాయ, ఉద్యోగులకి న్యాయం జరిగేలా చేయాలనీ కెసిఆర్ గారిని డిమాండ్ చేస్తున్నామాన్నరు, ఈ కార్యక్రమం లో జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల.శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల.సంతోష్,మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి.రాజు,పట్టణబీజేపీ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి.హరీష్, మండల బీజేపీ నాయకులు పల్ల.సాయి.ప్రసాద్ రెడ్డి,గుంటి మల్లేష్, తదితరులు పాలుగోన్నారు.