ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మండల కాంగ్రెస్ నేతలు

0

ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ సెల్:9392548716
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అధ్యక్షులు పసుల వెంకటి మాట్లాడుతూ మొన్నటి రోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చర్చ లేకుండానే తలుపులు మూసి మైక్ బందు చేసి తెలంగాణ ను ఏర్పాటు చేసినారు మాట్లాడినవ్ ఆ రోజులలో నువ్వు ఎక్కడ ఉన్నావు బండి సంజయ్ గారు ఒకసారి నువ్వు గుర్తు చేసుకో పార్లమెంటులో బిల్లు పెట్టేటప్పుడు మీ భారతీయ జనతాపార్టీ పక్ష నేత స్వర్గీయ సుష్మా స్వరాజ్   కూడా పార్లమెంటులో ఉండి రెండు గంటల పైచిలుకు మాట్లాడింది అది నీకు తెలియదా బండి సంజయ్ కుమార్  చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి ఎంపీ గారు మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఈ రకంగా మాట్లాడము మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసికూడా ప్రజల మనోభావాలను   తెలుసుకుని ఆనాడు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చి   మాట తప్పను అనే సిద్ధాంతంతో ఆనాడు తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మీరు ఈ రకంగా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఇకనైనా తెలంగాణ మీద మీరు అవాకులు చెవాకులు పేలితే క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో మిమ్ములను నిలదీయడం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ మండల జనరల్ సెక్రెటరీ అల్లపు రజినీకాంత్ బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జవాన్ ఉపాధ్యక్షులు గూడా నరేందర్ రెడ్డి మండల యువజన నాయకులు జట్టి మల్లేశం ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బడుగు లింగం మండల సీనియర్ నాయకులు ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top